ఖమ్మం జిల్లాలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్, సాయి గణేష్ నగర్, బోనకల్ రోడ్డు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపారని, ప్రజలను చైతన్యవంతులను చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. నేటి యువత గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డోగుపర్తి నాగేశ్వరావు, సెక్రటరీ చలువాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.