పుట్టకోట గ్రామంలోని SC కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు వాయిద్యాలు, DJ మధ్య గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. భక్తులు "గణపతి బప్పా మోర్యా" అంటూ నినాదాలు చేశారు. లడ్డు వేలంపాట కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు