బాలికపై సామూహిక అత్యాచారం

8చూసినవారు
బాలికపై సామూహిక అత్యాచారం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఓ బాలుడు వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు బాలురతో కలిసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సూరజ్ నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు వారిని అరెస్ట్ చేశారు.