ఖమ్మంలో ఘరానా మోసగాడు అరెస్ట్

4చూసినవారు
ఖమ్మంలో ఘరానా మోసగాడు అరెస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు మోసం చేసిన కాకినాడకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్