ఖమ్మం రోటరీనగర్లోని సీపీఐ పార్టీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖానాపురం హవేలీ కార్యదర్శి కామ్రేడ్ ఏనుగు గాంధీ జన్మదిన వేడుకలను ఖానాపురం హవేలీ శాఖ నాయకులు, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీకి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, కార్మిక సంఘాల బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను నాయకులు అభినందించారు. ప్రజా, కార్మిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, ఆటో కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.