రెవరెండ్ ఫాదర్ జేసురాజు గారికి ఆర్డినేషన్ డే సందర్భంగా భక్తులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. దేవుని పిలుపుకు 'ఎస్' చెప్పి సేవా మార్గాన్ని ఎంచుకున్న ఫాదర్ జేసురాజు గారి సేవలు మరింత ఫలప్రదం కావాలని, ఆయన గురుత్వ జీవితం ఆనందం, శాంతి, దీవెనలతో నిండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు.