ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవాలి.. హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్

1261చూసినవారు
ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవాలి.. హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ మంగళ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. మహర్షి ధన్వంతరి చిత్రపటానికి నివాళులర్పించి, వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేదం గొప్పతనం, ఔషధ మొక్కల ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్