ఖమ్మం జిల్లాలో భారీ వర్షం (వీడియో)

10చూసినవారు
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ వంటి వరద ముంపు ప్రాంతాలలో తిరగవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో 1077, 9063211298 నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.