ఖమ్మంలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

1257చూసినవారు
ఖమ్మంలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, వరద పరిస్థితుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం  తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1077 లేదా 9063211298కు సమాచారం అందించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్