ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు

4చూసినవారు
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
ఖమ్మం జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా వచ్చే నెల రెండో శనివారం విద్యాసంస్థలు పనిచేస్తాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్