ఖమ్మం మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. బుధవారం రాత్రి 7 గంటలకు 18 అడుగుల వద్ద ఉన్న వాగు అర్ధరాత్రి 22 అడుగులకు, తెల్లవారుజామున 5 గంటలకు 23 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని బొక్కలగడ్డ, మోతీ నగర్ ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.