తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రఘునాథపాలెం మండలంలో అత్యధికంగా 37 గ్రామపంచాయతీలకు 254 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. బోనకల్ మండలంలో 22 గ్రామపంచాయతీలకు 108 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. రఘునాథపాలెం మండలంలో 308 వార్డు స్థానాలకు 795 నామినేషన్లు, వైరా మండలంలో 200 వార్డులకు 440 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.