వెంకటగిరిలో ఇందిరమ్మ కాలనీ ఫేజ్–2లో గత మూడు రోజులుగా ఇంటి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటి పట్టాలు లేని వారు, అలాగే వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాని వారి వివరాలను సిబ్బంది పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కాలనీలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సర్వేను సద్వినియోగం చేసుకుని తమ ఇంటి వివరాలు సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు అయ్యేలా చూసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న సర్వేకు అవసరమైన పత్రాలతో సహకరించాలని స్థానికులకు సూచించారు.