శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వద్ద కాజీపేటలో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిని మధిర వాసులుగా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.