ఏపీ నుంచి అనుమతులు లేకుండా వీఎం బంజర్ వచ్చిన ఇసుక టిప్పర్‌ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ పసుపులేటి పవన్, యజమాని వెల్లంకి త్రినాధ రామకృష్ణ, మధ్యవర్తి అబ్బూరి రఘుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.