ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన బెరైటిష్ రాయిని అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి, అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సహజ వనరుల అక్రమ తరలింపును అడ్డుకోవాలని, అనుమతులను పరిశీలించి అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంత్ రావు, టౌన్ సెక్రెటరీ ఎస్. కె. జానీమియా పాల్గొన్నారు.