పెసర కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.. రమేష్

1183చూసినవారు
పెసర కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.. రమేష్
ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దొండపాటి రమేష్, ప్రభుత్వం పెసర పంట కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం గిరి ప్రసాద్ భవన్ లో జరిగిన రైతు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు చేతికొచ్చిన రైతు వద్ద నుండి కొనుగోలు చేయటంలో నిర్లక్ష్యం తగదని, దళారీలకు బలికాకుండా రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్