ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం కొత్తూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేశారు.