చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

3చూసినవారు
చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆర్టీజీఎస్ ఏఐ సీసీటీవీ 360 సాంకేతికతను ఉపయోగించుకుని తెనాలి పోలీసులు ఒక కేసును ఛేదించారు. ఈ నెల 9న తెనాలి మండలం హాఫ్ పేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. నిందితుడు కారులో వచ్చి బీరువాలోని రూ. 5 వేలను అపహరించాడు. నిందితుడి కారును సీసీటీవీ 360 యాప్‌లో అప్‌లోడ్ చేయగా, అది విజయవాడ-నందివెలుగు మార్గంలో వెళుతుండటంతో పోలీసులు నిఘా ఉంచి, నిందితుడిని కారుతో సహా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లికి చెందిన బండి గోపిగా గుర్తించారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులున్నాయి. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్