రాపల్లి గ్రామంలో సదరం అంగవైకల్య ధ్రువపత్రాల జారీలో అక్రమాలు

1547చూసినవారు
రాపల్లి గ్రామంలో సదరం అంగవైకల్య ధ్రువపత్రాల జారీలో అక్రమాలు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాపల్లి గ్రామంలో సదరం అంగవైకల్య ధ్రువపత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి అంగవైకల్యం లేని కొందరు దళారుల సహకారంతో నకిలీ సర్టిఫికెట్లు పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్నాటి బాబురావు, సంగెపు ముక్కటి అలియాస్ వెంకటేశ్వర్లు పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కేంద్రంగా చేసుకుని దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిజమైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్య లు.

సంబంధిత పోస్ట్