సెప్టెంబర్‌ 28న రాష్ట్రవ్యాప్తంగా జయంతి నిర్వహణ

29చూసినవారు
సెప్టెంబర్‌ 28న రాష్ట్రవ్యాప్తంగా జయంతి నిర్వహణ
భగత్‌సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఏఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌ వద్ద భగత్‌సింగ్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఏఐవైఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యువత భగత్‌సింగ్‌ రచనలు, ఆలోచనలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్, ప్రధాన కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రతి జిల్లా, మండలం, పట్టణం, విద్యాసంస్థల్లో జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చర్చలు, పుస్తక ప్రదర్శనలు, యువజన సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్