సమాచార శాఖ జేడీ జగన్‌కు అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి

6చూసినవారు
సమాచార శాఖ జేడీ జగన్‌కు అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డి. ఎస్. జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా మంగళవారం పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో ఫెడరేషన్ నాయకులు మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవనంలో జగన్‌ను కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సోమయ్య కోరారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్, కుంచం శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, కె. పాండురంగారావు, వి. రవికుమార్, నంబి పర్వతాలు, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్