ఖమ్మంలో నేడు జాబ్ మేళా

4చూసినవారు
ఖమ్మంలో నేడు జాబ్ మేళా
ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి తెలిపిన వివరాల ప్రకారం, నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఖమ్మం టీటీడీసీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫర్టిలైజర్ టెక్నాలజీస్ కంపెనీలో 35 పోస్టుల భర్తీకి కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి గల యువతీ, యువకులు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ లతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్