రేపు ఖమ్మంలో జాబ్ మేళా

78చూసినవారు
రేపు ఖమ్మంలో జాబ్ మేళా
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ నెల 11వ తేదీన టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి తెలిపారు. రిలయన్స్ కంపెనీలో 25 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్లతో ఉదయం 10గంటలకల్లా హాజరుకావాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్