రేపు ఖమ్మంలో జాబ్ మేళా

0చూసినవారు
రేపు ఖమ్మంలో జాబ్ మేళా
ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి తెలిపిన వివరాల ప్రకారం, నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అగ్రోటెక్ ఇరిటిలైజర్స్ కంపెనీలో 110 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 21-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఎస్సెస్సీ నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన వారు అర్హులు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఖమ్మం టీటీడీసీ భవనంలో 30న ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ తో హాజరుకావాలని సూచించారు.