ఖమ్మం నగరంలోని కాలేజ్ బాలికల వసతి గృహంలో ఆదివారం, అంతర్జాతీయ స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణులు ఎస్. ఎం. అరుణ్ విద్యార్థినులకు ఆంగ్ల భాషా నైపుణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్పోకెన్ ఇంగ్లీష్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ఏరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అవగాహనతో పాటు హ్యాండ్‌వాష్, సోప్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థినులు అరుణ్‌ను సన్మానించారు.