కల్లూరు: గుండెపోటుతో వ్యక్తి మృతి

1401చూసినవారు
కల్లూరు: గుండెపోటుతో వ్యక్తి మృతి
కల్లూరు పట్టణంలో విషాదం నెలకొంది. స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో కూరగాయల వ్యాపారం చేసుకునే సయ్యద్ గౌస్ మంగళవారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా, మధ్యాహ్నం నమాజ్ అనంతరం మసీదు ఆవరణలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండే గౌస్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ముస్లిం నాయకులు, వ్యాపారులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్