ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే కార్మికుల చార్జీలు 13 శాతం పెరిగాయి. రెండేళ్లకు ఒకసారి మార్కెట్ కార్మికుల రేట్ల పెంపుపై నూతన ఒప్పందం ఉంటుంది. తమకు రేట్లు పెంచాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గానికి, మార్కెట్ కమిటీకి నోటీసులు ఇచ్చారు. దీంతో 13 శాతం పెంచుతున్నట్లు మార్కెట్ కమిటీ నిర్ణయించారు. పెంచిన 13 శాతం రేట్లు మార్కెట్లో పనిచేసే సుమారు 2, 500 మంది కార్మికులకు వర్తించే అవకాశం ఉంది.