ఈ నెల 19న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమచారి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలోని సంఘం జిల్లా కార్యాలయంలో అయన మాట్లాడుతూ. విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని కోరారు.