ఖమ్మం: 288 నామినేషన్ల తిరస్కరణ

6చూసినవారు
ఖమ్మం: 288 నామినేషన్ల తిరస్కరణ
ఖమ్మం జిల్లాలో తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ఆదివారం రాత్రి పూర్తయింది. మొదటి విడతలో ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలకు, 1,740 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 1,142 నామినేషన్లు దాఖలు కాగా, 215 తిరస్కరించడంతో 927 మిగిలాయి. వార్డు స్థానాలకు 4,054 నామినేషన్లు రాగా, 73 తిరస్కరించడంతో 3,981 మిగిలాయని అధికారులు తెలిపారు.