ఐదు మున్సిపాలిటీల పరిధిలో గురువారం 309 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు దాఖలైన ఏడింటితో కలిపి మొత్తం 316 నామినేషన్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ నుంచి 114, బీఆర్ఎస్ నుంచి 124, బీజేపీ నుంచి 35, సీపీఎం నుంచి 23 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు పొందిన పార్టీల నుంచి 20 నామినేషన్లు అందాయి.