ఖమ్మం జిల్లాలో 59,448 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు 2,01,163 మందికి ఉచిత రేషన్ అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 2,45,069 మందికి 14,04,752 గ్యాస్ సిలిండర్లను రూ.500కే రూ.41 కోట్ల సబ్సిడీతో అందించామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఖమ్మం జిల్లా మహిళలు రూ.303.55 కోట్ల మేర ఆదా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.