నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అందిన దరఖాస్తుల లెక్క తేలింది. దరఖాస్తు గడువు సోమవారంతో ముగియగా, ఖమ్మం జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ శాఖల ద్వారా 93, 614 దరఖాస్తులు అందాయి. ఇందులో ఎస్సీ, బీసీ, ఎస్టీ శాఖల వారీగా ఈ ఏడాదికి లక్ష్యాలను సైతం కేటాయించగా, మైనార్టీ శాఖకు ఖరారు కావాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేస్తారు.