ఖమ్మం జానపద గాయని కొమ్ము రమాదేవి, భూదాన్ భూముల కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించి, గూడు కోల్పోయిన పేదల ఆవేదనను చూసి చలించిపోయారు. 'ఉన్నవాడు మేడల మీద మేడ కడుతుంటే, లేనివాడికి ఉన్న నీడ నేలకొరిగిపోతోంది. ఇదేనా నా దేశం మారిన తీరు?' అంటూ ఆమె బాధితుల కన్నీటి గాథలను పాట రూపంలో వ్యక్తీకరిస్తూ, అండగా ఉండాల్సిన వ్యవస్థలే నిలువ నీడ లేకుండా చేయడంపై పాట ద్వారా నిలదీశారు.