ఖమ్మం నగరంలోని సోనోవిజన్ దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు దర్యాప్తులో భాగంగా, దొంగతనం కోసం ఉపయోగించిన కారుకు తప్పుడు నంబర్ ప్లేట్ అమర్చినట్లు గుర్తించారు. ఈ కారు నంబర్ గుంటూరులో రిజిస్టర్ అయిన ఇంటి చిరునామాకు వెళ్లగా, అక్కడ ఉన్న కారు వేరేదని తేలింది. దీంతో దొంగలు ఉపయోగించిన కారు నంబర్ డూప్లికేట్ అని పోలీసులు నిర్ధారించారు.