ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలక కార్యవర్గ కమిటీ సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా బొల్లి కొమరయ్య గౌరవ అధ్యక్షుడిగా, పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి జోక్తి రెడ్డి గౌరవ సలహాదారులుగా, అల్లిక అంజయ్య అధ్యక్షుడిగా, బెల్లి కొండల్ రావు ప్రధాన కార్యదర్శిగా, పల్లపు సత్యం కోశాధికారిగా ప్రమాణం చేశారు. అలాగే, రాచకొండ వెంకటేశ్వరరావు, అల్లిక వీరబాబు, గుగులోత్ మణికంఠ, వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారం ఆలయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.