కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన పీఏసీఎస్ పాలకవర్గాలను తిరిగి కొనసాగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలో సహకార సంఘాల పాలకవర్గాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా, 2025 ఫిబ్రవరి 14నాటికి పదవీ కాలం ముగిసింది. ఎన్నికలు నిర్వహించకుండా సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించారు. అయితే, ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాలనే కొనసాగించాలని కొందరు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా కోర్టులో విచారణ జరగగా, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకపోవటంతో తిరిగి సొసైటీ పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.