ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి మంగళవారం గంజాయి రవాణాకు సంబంధించి రెండు కేసుల్లో నిందితుడైన పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62)కు ఏడాది చొప్పున జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడిన నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు.