ఖమ్మం: నిరంతర శ్రమతోనే ఉన్నత లక్ష్యాల సాధన

72చూసినవారు
ఖమ్మం: నిరంతర శ్రమతోనే ఉన్నత లక్ష్యాల సాధన
ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవడమే కాక నిరంతరం శ్రమిస్తేనే వాటిని సాధించొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని బొమ్మ విద్యాసంస్థల్లో శుక్రవారం నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవాల్లో మాట్లాడారు. యువత లక్ష్యాలను ఎంచుకుని ఎప్పటికప్పుడు ఎలా సాధించాలనే ప్రశ్న వేసుకుంటూ ముందుకు సాగితే ఫలితం ఉంటుందన్నారు. ఉన్నతస్థాయికి చేరడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తే సంతృప్తిగా ఉంటుందన్నారు.