అధికారంలోకి వచ్చాక ప్రజల విషయంలో అహంకారపూరితంగా వ్యవహరించే ప్రభుత్వాలను గద్దె దింపడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, పెన్షన్ల నగదు పెంచడమే కాక నగర ప్రజలపై పన్ను భారాలు తగ్గించాలనే డిమాండ్తో సీపీఎం ఆధ్వర్యాన కేఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.