ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు తన ఒక చేతిని కోల్పోయి వికలాంగుడిగా మారిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చికిత్స కోసం చేరిన బాలుడికి వైద్యులు సరైన సంరక్షణ అందించకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మంగళవారం ప్రభుత్వ విచారణ కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు.