నగరంలో సరైన నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నంబర్ ప్లేట్ లేని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు రూ. 14,000 వరకు జరిమానా విధించి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రాంగ్/అపోజిట్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలకు రూ. 1700 వరకు జరిమానా విధించారు.