సీపీఎం వన్ టౌన్ సీనియర్ నాయకులు ఎస్కే అఫ్జల్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా నేతలు అఫ్జల్ భౌతికకాయానికి జెండా కప్పి నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ అఫ్జల్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జబ్బార్, వన్ టౌన్ సీనియర్ నాయకులు ఖయ్యూమ్ ఉన్నారు.