ఖమ్మం వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు బుధవారం సెలవు ప్రకటించారు. గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి పండుగలను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి మార్కెట్లో యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని వారు సూచించారు.