ఖమ్మం: కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

81చూసినవారు
ఖమ్మం: కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేనన్నారు. అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్