ఖమ్మం: జూన్ 24నుంచి జూలై 25 వరకు సవరణ

0చూసినవారు
ఖమ్మం: జూన్ 24నుంచి జూలై 25 వరకు సవరణ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ వచ్చేనెల 24 నుంచి జూలై 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా, ఫారం-6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించుకున్నాకే జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ దివాకర్ సూచించారు. అనంతరం, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాక, అందే అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ నుండి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష జరిగింది.

సంబంధిత పోస్ట్