ఖమ్మం: ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై విచారణ జరపాలి

3చూసినవారు
ఖమ్మం: ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై విచారణ జరపాలి
ఖమ్మం నగరంలోని గొల్లగూడెం మెయిన్ రోడ్ లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై తక్షణమే విచారణ జరిపించి, ఆక్రమణకు గురైన స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. లకారం ట్యాంక్ బండ్ నుంచి గొల్లగూడెం రోడ్ లో ఆక్రమణకు గురైన పలు స్థలాలను పార్టీ బృందం పరిశీలించింది. సర్వే నంబర్ 58, 59లో అక్రమ రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రేకుల షెడ్లు వేస్తున్నా కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కబ్జాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్