ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి మంజూరైన రూ. 9 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ట్రాక్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ లాభాల కోసమే ప్రతిపాదనలు పంపుతున్నారని ఆరోపించారు. ట్రాక్ నిధులు, నాణ్యతపై మున్సిపల్ కమిషనర్, మేయర్, డీవైఎస్ఓ విచారణ జరిపించాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.