ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం మొగలి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో 'ఆనందో బ్రహ్మ' అనే కామెడీ షో నిర్వహించబడుతుంది. సంస్థ అధినేత మొగిలి గుణకర్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ సంస్థల్లో ప్రదర్శనలిచ్చిన కళాకారులు, వివిధ రాష్ట్రాల కమెడియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లావాసులను ఈ షోను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నామవరపు కాంతేశ్వరరావు, విద్యాసాగర్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు.