ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చేయి కోల్పోయిన శిశువు కుటుంబానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పిఓడబ్ల్యూ, పివైఎల్ ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. చిన్నారికి విద్యా, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, ఈ ఘటనకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.